ఇవాళ మంచిర్యాల పర్యటనకు మంత్రి కేటీఆర్‌..కారణం ఇదే

-

మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మందమర్రి, క్యాతన్ పల్లి ల్లో పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు కేటీఆర్‌. ఇక పర్యటనలో భాగంగా… ఇవాళ ఉదయం పది గంటల కు మంచిర్యాల జిల్లాకు చేరుకోనున్నారు మంత్రి కేటీఆర్‌. అభివృద్ధి కార్యక్రమాల తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు.

Minister KTR’s visit to Manchryala today

రెండు గంటలకు రామగుండం వెళ్లనున్న కేటీఆర్…మందమర్రి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 312,96 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మందమర్రి సమీపంలోని 72 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలు పూర్తి అయిన 286 డబుల్ బెడ్ రూమ్స్ ను ప్రజలకు పంపిణీ చేస్తారు. హైద్రాబాద్ తరహాలో కేసీఆర్ అర్బన్ పార్కుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన సమ్మక్క-సారలమ్మ మహిళ భవన్ ను ప్రారంభం చేసిన తర్వాత మందమర్రి పట్టణంలో మినిస్టర్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version