ఓటుకు నోటు కేసులో కదలిక..మళ్లీ తెరపైకి చంద్రబాబు పేరు !

-

రేవంత్‌ రెడ్డి పేరు వినగానే ఓటుకు నోటు కేసు అందరికీ గుర్తుకు వస్తుంది. అయితే.. తాజాగా ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చింది. మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసు అక్టోబర్ 4 వ తేదీకి లిస్ట్ అయింది. 2017 లో మంగళగిరి ఎమ్మెల్యే RK రెండు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.

అందులో ఒకటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు లో ఓ పిటిషన్ వేశారు మంగళగిరి ఎమ్మెల్యే RK. తెలంగాణ ACB నుండి ఓటుకు నోటు‌ కేసును CBI కి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే RK.

ఈ తరుణంలోనే.. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం వద్దకు ఓటుకు నోట్ కేసు వెళ్లింది. అక్టోబర్ 4వ తేదీన కోర్టు నంబర్ 16..ఐటెమ్ 109గా ఓటుకు నోటు కేసుపై విచారణ జరుగనుంది. మరిదీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version