వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు : మంత్రి పొంగులేటి

-

వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు మంత్రి పొంగులేటి. తెలంగాణ మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….ఇందిరమ్మ ప్రభుత్వం లో కండీషన్ లు పెట్టి ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదని… గత ప్రభుత్వం లో కాంట్రాక్టర్లకు ఇళ్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

 

Ponguleti

4.50 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని… 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారని పేర్కొన్నారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తామని… ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లు నిర్మిస్తామన్నారు. సంక్రాంతి నాటికి కూసుమంచి లో మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది….. ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version