ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. నిన్న సాయంత్రం కిషన్ రెడ్డితో భేటీ అయిన సీఎం రేవంత్ ఆయన్ను సన్మానించిన విషయం తెలిసిందే. ఆ ఫోటోను ఎక్స్‌లో పోస్టు చేసిన కేటీఆర్..సీఎం రేవంత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎందుకు ఈ సన్మానం? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనుపో అని చెప్పినందుకా? లేక, అమృత్ స్కాంలో నీ బావమరిదిని కాపాడుతున్నందుకా?, పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో మీ వివరాలు బయటకి రాకుండా ఆపి, కేసులు పెట్టకుండా ఆపినందుకా? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదిలాఉండగా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల మంజూరు విషయపై సీఎం రేవంత్ కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నట్లు సమాచారం. నేడు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ రేవంత్ రెడ్డి సమావేశమై నిధుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.