రైతులు తీసుకొచ్చిన పత్తి లో కోత విధిస్తే సహించబోము. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈసంవత్సరం అధిక వర్షాలతో పత్తి రైతులు నష్ట పోయారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుంది. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం. రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని విప్లవాత్మక మార్పులు చేసాం. ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేసాం. రుణమాఫీ పై ప్రతిపక్షాలు కారుకూతలు కూస్తున్నారు. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైన రుణమాఫీ చేస్తాం. డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తాం.
అలాగే అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుకగా ఇవ్వబోతున్నాం. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టిచారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తాం. వరికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాము,ఇవ్వబోతున్నమ్. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకుపోవాలి. సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలి. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలి. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎక్కడ నష్టం కలుగకుండా చూడాలి. రైతుల అవసరం, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉంది అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.