రేషన్‌ కార్డు దారులకు మంత్రి పొంగులేటి హెచ్చరికలు..రద్దు చేసుకోవాంటూ !

-

రేషన్‌ కార్డు దారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు చేశారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో అధికారులను బెదిరించి రేషన్ కార్డు పొంది ఉంటే వారంతట వారే రద్దు చేసుకుంటే మంచిదన్నారు. బెదిరింపులకు పాల్పడి రేషన్ కార్డులు పొందిన వారు రద్దు చేసుకోవాలని లేదంటే సీరియస్ గా వుంటుందని హెచ్చరించారు.

ఒక సంవత్సరంలోపే పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామములో సీసీ రోడ్లు పూర్తిచేసే బాధ్యత నాది…గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలల్లో అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయిందని వెల్లడించారు. ప్రతి నిరుపేదకు సహాయం చేయాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ ప్రభుత్వ ఆలోచన అన్నారు.

విద్య వైద్య విషయంలో ఎవరైనా బహు పేద వాళ్ళ ఉంటే వారి కి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఐదుగురితో ఒక కమిటీ వేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆ కమిటీ వారి సూచనలు ఆలోచన మేరకే అభివృద్ధి చేయడం జరుగుతుంది…విద్య వైద్య విషయంలో నిరుపేదలకి ఎవరికైనా ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే నా వ్యక్తిగతంగా వారికి ఎలా సహాయం చేయాలో అలా చేస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version