ఇక ఆ తేడా లేకుండా అన్ని గురుకులాలల్లో అందరికీ అడ్మిషన్స్..!

-

జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు పెరుగవు. హైడ్రా పేరుతో అన్ని మున్సిపలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో కలుస్తాయనేది కాదు. వేటికవే ఉంటాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఓఆర్ఆర్ గ్రామాలకు దగ్గరగా ఉన్న మున్సిపాలిటీలలో ఆ గ్రామాలను కలుపుతారు. అదే ఆర్డినెన్స్ హైడ్రాతో సంబంధం లేదు. ఇక గురుకులలకు 100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. రెంటెడ్ బ్లిడింగ్స్ ఎన్ని ఉన్నాయి. ఏంటి అనేది లెక్క తీస్తున్నాం. త్వరలోనే బకాయిలు రిలీజ్ చేస్తాం అని చెప్పారు.

అదే విధంగా ఉపాధి హామీ పథకం కింద గురుకులాల బిల్డింగ్స్ చుట్టు క్లిన్ చేయిస్తాం. డీపీవో, డీఎంహెచ్ఓ, రెవిన్యూ అధికారి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి గురుకులాలను తరుచూ విజిట్ చేస్తూ మానిటర్ చేస్తారు. స్టూడెంట్స్ డైనింగ్ మీద తినాలి.. ఫిల్టర్ వాటర్ తాగాలి. బెడ్ మీద పడుకోవాలి. యూనిఫామ్ వేసుకోవాలి ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఇక బీసీ, ఎస్సి, ఎస్టీ, అని తేడా లేకుండా అన్ని గురుకులాలల్లో అందరికి అడ్మిషన్స్ ఇస్తాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news