తెలంగాణ రవాణా శాఖ లో నూతనంగా నియమించబడిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.. రవాణా శాఖ లో చాల కాలంగా పెండింగ్ లో ఉన్న వాహన సారథిలో ఇప్పటికే 28 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. మనం కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచనతో అమలు చేస్తున్నాం అని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆటో మేటిక్ టెస్టింగ్ సెంటర్స్ తేవాలని ముఖ్యమంత్రి గారి అనుమతి తో 37 టెస్టింగ్ సెంటర్స్ కి జీవో తెచ్చుకున్నాం. ముఖ్యమంత్రి నేతృత్వంలో వాహన స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం. రోడ్డు ప్రమాదాలలో తెలంగాణ లో రోజుకు 20 మంది మరణిస్తారు. రోడ్డు సేఫ్టీ కి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే విభాగం లో అన్ని స్కూల్ లలో అవగాహన కార్యక్రమాలు చేపడతాం. ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం.
నూతన అసిస్టెంట్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు ఇప్పటికే పని చేస్తున్న అధికారులు ఉన్నారు..అన్ని డిపార్ట్మెంట్ లకి లోగో ఉంది. రవాణా శాఖ కి ప్రత్యేక లోగో తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ అనుమతితో ఎన్ఫోర్స్మెంట్ కి ప్రత్యేక వాహనాలు తీసుకొస్తున్నం. రవాణా శాఖ చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ ఇతర వాటిలో రూల్స్ ప్రకారం ముందుకు పోతున్నాం. రవాణా శాఖ ను సరిదిద్దడానికి కొత్తగా నియామకం అవుతున్న AMVI లను చెక్ పోస్టులకు కాకుండా ఎన్ఫోర్స్ మెంట్ లో ఉపయోగించుకొని శాఖ గౌరవాన్ని పెంపొందించాలి అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.