టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వెంకటాచలంలో నాపై రెండు కేసులు.. ముత్తుకూరులో ఒక కేసు నమోదు చేశారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని తెలిపారు. సోమిరెడ్డి లంచం అడిగాడని బీజేపీ దళిత నేత ప్రెస్ మీట్ పెడితే.. అతని ఆవేదనను అర్ధం చేసుకుని.. వీడియో ని ఫార్వర్డ్ చేసానని కేసు పెట్టారు. సూపర్ సిక్స్ అమలు చేయలేదని ప్రశ్నిస్తే మరో కేసు పెట్టారు. టీడీపీ నేతలు కక్షపూరీతంగా వ్యవహరిస్తున్నారు. ఆరోపణల మీద ఆధారాలు చూపాలని పోలీసులు అడిగారు.
అయితే పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉండటం వల్లే విచారణకు హాజరయ్యాను. కానీ కేసులు.. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. అవసరమైతే జైలుకు వెళ్తాను గానీ.. రాజకీయంగా వెనక్కి తగ్గను. సోమిరెడ్డి అవినీతి మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి లాంటి బలహీనుడి మీద కేసులు పెట్టించలేదు. అలాంటి చిల్లర పనులు చేయను. కానీ సోమిరెడ్డి బలహీనుడు కాబట్టే.. నా విమర్శలకు భయపడి అక్రమ కేసులు పెట్టిస్తున్నాడు. రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అందరి లెక్కలూ తేలుస్తాం. ప్రాణం ఉన్నంత వరకూ జగన్ వెంటే నడుస్తా అని కాకాణి స్పష్టం చేసారు.