చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండ పాలెం పోలీసుల నోటీసులు

-

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలీసులు తాజాగా చర్యలు చేపట్టారు.

కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన క్రమంలో ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా నోటీసులు జారీ చేయగా ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news