గీతా కార్మికులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తాటి చెట్టు నుండి పడి గీతా కార్మికులు చనిపోతున్నారని ఈ కాటమయ్య కిట్ తయారు చేశారని తెలిపారు. తాటి చెట్టు ఎక్కే ప్రతి వ్యక్తికి ఈ కిట్ ఇస్తాం, ప్రభుత్వంతో పాటు శాసనసభ్యుని, పార్లమెంట్ సభ్యుని నిధులు కూడా వెచ్చించి ఈ రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామన్నారు.
తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. రోడ్లమీద వేరే చెట్లు పెడితే ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చర్చించారని తెలిపారు. 50% తాటి ఈత చెట్లను కాలువలు, రోడ్ల పక్కన, చెరువుల గట్ల పైన నాటాలని పేర్కొన్నారు. ఈ కిట్లను గీతా కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలి, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మార్చ్ తర్వాత గీత కార్మికులకు మోపెడులు ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.