రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

-

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. కమిషన్ల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని రేవంత్ చెప్పడం దారుణమని ఫైర్‌ అయ్యారు. అమెరికాలో రైతుల గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది రైతుల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ది అని ఫైర్‌అయ్యారు.

3 గంటల కరెంట్ ఇస్తామని దమ్ముంటే మీ మ్యానిఫెస్ట్ లో పెట్టండని రేవంత్ కు ఛాలెంజ్ విసురుతున్నామన్నారు. అలా చేస్తే.. రైతులు గ్రామాల్లోకి కూడా రానివ్వరు మిమ్మల్ని అంటూ మండిపడ్డారు. రైతుల పట్ల రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రేమ ఏంటో అర్ధమవుతుందని చెప్పారు. మీరు ఎన్ని చెప్పినా.. మేము ఖచ్చితంగా 24గంటల ఉచిత కరెంట్ రైతులకు ఇస్తామని తెలిపారు. గాంధీ భవన్ లో దూరిన గాడ్సే రేవంత్ రెడ్డి…ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అదృష్టం కాళేశ్వరమన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరమని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version