అంగన్వాడీల సమ్మెపై మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే.. అంగన్వాడీల సమ్మెపై తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలని పిలుపునిచ్చారు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

Minister Satyavati Rathore has called upon Anganwadis to end their strike immediately

కేసీఆర్‌ 3 పర్యాయాలు వేతనాలను పెంచగా, ప్రస్తుతం మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,600 వరకు రాష్ట్ర సర్కార్‌ వేతనాలను పెంచిందని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.

అంగన్వాడి టీచర్లు హెల్పర్లు వెంటనే విధులోకి చేరండి, ఏవైనా సమస్యలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరాలు సాధించుకుందామని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దని కోరారు తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version