కేటీఆర్ నీకు ధైర్యం ఉంటె చాటుకు గా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు అని ఛాలెంజ్ విసిరింది మంత్రి సీతక్క. పండగపూట కూడా మావెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మా బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుంది. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర BRS పార్టీది.
రాహుల్ గాంధీ కుటుంబం త్యాగము, కష్టము నిజాయితీ ముందు నువ్వెంత..? రాహుల్ గాంధీనీ అనేస్తాయి కేటీఆర్ కాదు. బీసీ, ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా.. స్వతంత్రంగా ఎదిగాము. మేం సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చాము.. ఎందుకు మా మీద అక్కస్సు. మమ్మల్ని అసభ్యకరంగా దూషించి మమ్మల్ని శిఖండి అని ఎట్లా అంటారు.. గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు. వెంటపడి మమ్మల్ని వేధిస్తున్నారు దుర్మార్గులు. పనికట్టుకొని సినిమా వాళ్ళ గురించి మేము మాట్లాడట్లేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడారు. సినిమా యాక్టర్లకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళను ద్వేషించడం లేదు అని సీతక్క పేర్కొన్నారు.