మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే నాగ చైతన్య అలాగే సమంత విడిపోయారు అంటూ ఆమె పేర్కొన సంఫతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ హల కూల్చకుండా ఉండటానికి సమంతను పంపమని కేటీఆర్ అడిగాడు అని.. దానికి నాగార్జున, చైతన్య ఒప్పుకున్న సమంత ఒప్పుకోకపోవడంతోనే విడాకులు జరిగాయి అని సురేఖ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై నాగార్జున ట్విటర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అని నాగార్జున తన ట్విట్ లో తెలిపారు.