దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ : మంత్రి సీతక్క

-

బీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ది తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారు అని మంత్రి సీతక్క అన్నారు. మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. హైడ్రాకు అడ్డుపడుతున్నారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది అని ప్రశ్నించిన సీతక్క.. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసింది. కానీ మేము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది.

దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. మాకు మూటలు మోసే అలవాటు లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారు… ఇప్పుడు తిడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నాం. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నాం. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. ఇక ఆరు గ్యారంటీల్లో.. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతురుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశాం అని సీతక్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version