లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను వేధింపులు ఆపాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పిలను ఆదేశించారు. బాధిత రైతులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసి తమ వ్వవసాయ భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని, కలెక్టర్ పై దాడి సాకుతో పోలీసులు అమాయక రైతులను అరెస్టు చేస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేయగా స్పందించిన చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారంనాడు జిల్లా కలెక్టర్, ఎస్పిలకు ఫోన్ చేసి లగచర్ల సంఘటనపై అరా తీశారు.
గిరిజన రైతుల సాగు భూములను స్వాధీనం చేసుకుంటే వారు ఏం చేసి బతుకుతారని కలెక్టర్ ను ప్రశ్నించారు. ఫార్మా కంపెనీలకు పడావు భూములలో ఏర్పాటు చేయవచ్చు కదా అన్నారు. పోలీసుల చిత్రహింసలకు గురైన బాధితులకు వైద్య శిబిరం ఏర్పాటు చెసి వైద్య సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అమాయక రైతులను వెధించవద్దని అక్రమంగా అరెస్టు చెయవద్దని జిల్లా ఎస్పీని ఆదేశించారు. లగచర్ల ఘటన పై రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ కు పూర్తి నివేదిక అందజేయాలని కమిషన్ త్వరలో లగచర్లలో పర్యటించి బాధిత రైతులను విచారిస్తామని అధికారులకు స్పష్టం చేశారు.