ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్..!

-

ఆత్మగౌరవం ఆదివాసీలకు అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కొమురం భీం. కొమురం భీం లేక పోతే మనం లేక పొయే వాళ్ళం. కొమురం భీం పోరాటంతోనే హక్కులు. కొమురం భీం పోరాట స్ఫూర్తి తోనే సాగిన పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇప్పటివరకు లక్ష 60 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చాము. ఇక ఫారెస్ట్ అధికారులకు పోడు భూములవిషయంలో అత్యుత్సాహం వద్దు. అవగాహన కల్పించాలి. ప్రజల పై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుతుంది.

ఐటిడీ ఏ కేంద్రం గా పాలన పటిష్టం చేస్తాం. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జోడే ఘాట్ వస్తారు. జోడే ఘాట్ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తాం. 6 కోట్లు టూరిజం అభివృద్ధికి ఇస్తాం. కొమురం భీం ప్రాజెక్టు ను టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం. రోడ్లు, ఇండ్లు హాస్టల్ ల అభివృద్ధి కి మేము కట్టుబడి ఉంటాం. ఇందిరమ్మ ఇండ్ల ఇస్తాం కలెక్టర్ నివేదిక తయారు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అలాగే అటవీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. ఆదివాసీ చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పెద్దలదే. సమస్య ల పరిష్కారంకు శాంతి యుతంగా ముందుకు వెళ్దాం. జీ నంబర్ 3, ఆదివాసీ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ సమక్షం లో సమావేశం అయ్యి చర్చిద్దాం అని మంత్రి సీతక్క అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version