మూసీ టెండర్ అగ్రిమెంట్ రూ.141 కోట్లు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

-

మూసీ ప్రాజెక్ట్ పనులు దక్కించుకున్న సంస్థపై ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సచివాలయంలో మూసీ నది పునరుజ్జీవనం పై ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మూసీ నది పునరుజ్జీవనం కోసం రూ.141 కోట్లు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని 5 బెస్ట్ కంపెనీలను డీపీఆర్ సిద్ధం చేయమని చెప్పామన్నారు.

మూసీ పై ప్రతిపక్షాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాయని పేర్కొన్నారు. మూసీ కోసం లక్ష 50వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. ముచ్చింతల్ లో కేసీఆర్, మైహోం రామేశ్వర్, చినజీయర్ కలిసి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేశారు. దానిని అద్భుతమంటూ స్వయంగా ప్రధాని మోడీనే వచ్చి ఆవిష్కరించారు. ఆ విగ్రహం కట్టిన సంస్థే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పనులు చేపడుతోంది. అప్పుడు లేని ఆరోపణలు, అపోహలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. 5 కంపెనీలు మూసీ ప్రాజెక్ట్ రిపోర్టు పై నిరంతరం సలహాలు, సూచనలు ఇవ్వడానికి 18 నెలలు పని చేస్తాయని.. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మరో ఐదేళ్లు పని చేస్తాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version