రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయి. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం. అన్ని సబ్సిడీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తాం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతం. ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దు. భారతదేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన రాష్ట్రంలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నాం.
ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు. ఈ సీజన్లో రైతులు ఎక్కువగా సన్నధాన్యాన్ని పండించారు. 500 రూపాయలు అదనంగా ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 25 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. మరో 25 వేల కోట్లు రైతుల ఖాతాలోకి రావాల్సినవి ఉన్నాయి. రుణ మాఫీ పూర్తి చేసి , రైతు భరోసా ప్రారంభిస్తాం అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.