తెలంగాణలో రికార్డు స్థాయిలో రైతులు ధాన్యం పండించారు : మంత్రి ఉత్తమ్

-

పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ పనులు, కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, రామగుండం ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజ్ 2 పనులు, ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్ రైస్ డెలివరీ తదితర అంశాల పై మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు రికార్డు సమయంలో వడ్ల డబ్బులు పడ్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version