రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు (జూన్ 7వ తేదీ) మేడిగడ్డను సందర్శించనున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు చేపడుతున్న చర్యలు, పరీక్షలను ఆయన పరిశీలించనున్నారు. ఈ క్రమంలో మంత్రి రాకకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి వెంట పలువురు నీటిపారుదల శాఖ అధికారులు కూడా రానున్నారు.

మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో దిగువ భాగాన రాఫ్ట్‌ పునాదుల వద్ద నిపుణుల కమిటీ  సీపేజీని గుర్తించింది. దాన్ని అరికట్టడానికి ఇసుక, సిమెంటును వినియోగించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. మేడిగడ్డ కుంగిన సంఘటనతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న న్యాయ కమిషన్‌కు సహాయపడేందుకు గత నెల 22న నీటిపారుదల శాఖ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్లకు ఈఎన్సీ సూచించారు. ఇప్పటికే నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల ప్రకారం పనులు చేస్తున్నారు. తాజాగా ఈ కమిటీ కొన్ని పనులు సూచిస్తూ వేగంగా చేయాలని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version