నేటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ ఉన్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

వెయ్యి మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొననున్నారు. 120 దేశాల కంటెస్టెంట్స్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 109 దేశాల నుంచి వచ్చారు. స్టేడియం, కంటెస్టెంట్‌లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం ఏర్పాట్లు చేశారు.
కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒక పక్క యుద్ధం జరుగుతుంటే మరోపక్క ఈ అందాల పోటీలు నిర్వహించడం కరెక్ట్ కాదని చురకలు అంటించారు.