అధికారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్.. అందుకోసమేనా ?

-

అధికారులు ప్రోటో కాల్ పాటించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అధికారులను హెచ్చరిస్తున్నా..అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నా బ్లాక్ బుక్ లో మీ పేర్లు రాస్తున్న..మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బ్లాక్ డెస్ ఉంటాయి. 34 నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదు. మాకు తెలియకుండా నియోజకవర్గాల్లో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్నారు.  ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కోరుతున్నట్టు తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తాడు అని కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ ఆపుతున్నారు.  368 కళ్యాణ లక్ష్మి చెక్కులు హుజూరాబాద్ నియోజకవర్గం కు వచ్చాయి ..అవి ఇవ్వడం లేదు.. ఈ నెల 27 న చెక్కుల తేది అయిపోతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తే అభ్యంతరం లేదు.. ఎందుకు పొన్నం ప్రభాకర్ భయపడుతున్నారు ? కళ్యాణ లక్ష్మి లో తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది..అది అడుగుతామని భయపడుతున్నారా ? అని ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి.  బుధవారం 11 గంటలకు జూబ్లి హిల్స్ టిటిడి టెంపెల్ దగ్గరకు రావాలి మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలి అని సవాల్ విసురుతున్నా..  ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.  వేంకటేశ్వర స్వామి ముందు నేను డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలి పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ డబ్బులు తీసుకున్నారని నేను ప్రమాణం చేస్తా.. బుధవారం ఫ్లై యాష్ స్కాం లో పొన్నం ప్రభాకర్ మరిన్ని వివరాలు చెబుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version