హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం దాఖలు చేసిన ఆపిల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేశారు. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని, అలాంటప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో తప్పు లేదని కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రతివాదులు తరపు వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.