తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. సబితా ఇంద్రా రెడ్డికి ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. నిన్న కెసిఆర్ ఫామ్ హౌస్ లో… సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఆ తర్వాత తీవ్ర స్వస్థతకు గురయ్యారట. ఆమెకు ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుందని చెబుతున్నారు.

దీంతో వెంటనే సిద్దిపేటలోని ఆర్ వి ఎం ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత ఆరోగ్యం కుదుట పడగానే…. హైదరాబాద్ వెళ్లిపోయారట. అయితే ఆమెకు వడదెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా కేసిఆర్ సమావేశానికి వెళ్లారట. ఇంతలోనే ఈ పరిణామం చోటుచేసుకుందని సమాచారం.