లేడీస్ హాస్టల్ లో స్పై కెమెరా కలకలం మరోసారి చోటుచేసుకుంది. గతంలో ఏపీలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో అచ్చం ఇదే ఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలోని మైత్రి విల్లాస్..లో ఓ గర్ల్స్ హాస్టల్ ను నడుపుతున్నారు బండారు మహేశ్వర్.

అయితే హాస్టల్ లో స్పై కెమెరాను గుర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు అందులో ఉండే లేడీ విద్యార్థులు. విద్యార్థుల ఫిర్యాదుతో హాస్టల్లో సోదాలు జరిపి స్పై కెమెరా లోని పలు చిప్స్ పరిశీలించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే స్పై కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వర్ ను ఈ నేపథ్యంలోని అరెస్టు చేయడం జరిగింది.