గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న… ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఆస్తి పన్ను చెల్లింపుల పైన కీలక ప్రకటన చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు వెసులుబాటు కల్పించింది సర్కార్.

90% వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓ టి ఎస్ ను అమలు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటిఎస్ లు మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10% చెల్లిస్తే సరిపోతుందని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో… ఆస్తి పన్ను బకాయి ఉన్నవారు కట్టేందుకు లైన్ కడుతున్నారు.