జీవన్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..నాదే అసలు కాంగ్రెస్!

-

జీవన్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో మాదే అసలైన కాంగ్రెస్ కుటుంబం అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మేము ఎపుడూ హింసని ప్రోత్సహించబోమని తెలిపారు. హింసలు, హత్యలు ఎవరి ఇంట్లో జరిగాయో జగిత్యాల ప్రజలకు తెలుసు అన్నారు. కాంగ్రెస్ లో అవకాశాలు రాకపోవడంతోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేశానని వివరించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

mla sanjay kumar on mlc jeevan reddy

ఇదే జీవన్ రెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గం నుంచి బయటకు వచ్చి నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో చేరి ఇంకో పార్టీతో కలవలేదా ? అంటూ నిలదీశారు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని ప్రకటించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. దానికి జీవన్ రెడ్డి పదే పదే పార్టీ ఫిరాయింపులు అని మాట్లాడటం సమంజసం కాదని సీరియస్ అయ్యారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version