సియోల్ లో స్మార్ట్ సిటీని సందర్శించిన తెలంగాణ డెలిగేషన్ టీమ్..!

-

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో పర్యటిస్తున్న తెలంగాణ అధికార బృందం మూడో రోజైన బుధవారం మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను సందర్శించింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరంలో భాగమైన చియోంగ్న, సాంగడో, యోంగ్ జాంగ్ స్మార్ట్ సిటీలను సందర్శించింది. ఈ సందర్శనలో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం 2003లో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ స్థాపించారని చెప్పారు. ఫైనాన్స్ టూరిజం వ్యాపారం కోసం ఒక ఐటీబీటీ హబ్ ను నాలెడ్జ్, సర్వీస్ ఇండస్ట్రీని స్థాపించారని ఇది లాజిస్టిక్స్ అండ్ టూరిజం పై దృష్టి సారిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version