కొత్త డైరెక్టర్ తో సినిమా చేసేందుకు అను ఇమ్మానుయేల్ గ్రీన్ సిగ్నల్..!

-

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటేడ్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తెలుగు సహా తమిళంలో పలు సినిమాలు చేసింది ఈ యంగ్ హీరోయిన్. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని లాంటి స్టార్స్ సరసన నటించింది. చివరగా ఈమె కోలీవుడ్ లో జపాన్ అనే సినిమాలో కనిపించింది.

ఈ సినిమా తరువాత అను ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ ఛాయగ్రాహకులు ఐ ఆండ్రు బాబు దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్న మూవీతో అను వర్క్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో యువ నటుడు శివ కందుకూరి నటిస్తున్నారు. అయితే ఆండ్రు ఎందుకంటే ప్రేమంట, తేజ్ ఐ లవ్ యు, కందిరీగ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీతో డైరెక్టర్ గా మారుతున్నారు. ఆల్రెడీ లండన్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ ఆర్ట్స్ , బిగ్ మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. త్వరలోనే మరిన్నీ వివరాలు అందించనున్నట్టు మేకర్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version