చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తొలిసారి స్పందించారు. చంద్రబాబును అలా అరెస్టు చేయడం చాలా తప్పు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టడం సరైనది కాదని వెల్లడించారు.
ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారని… ఆయన ఈ స్కామ్ చేయలేదని తెలిపారు. లక్షల కోట్లలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు… ఈ కేసులో రాజకీయ కోణాలే ఉన్నాయి అని అందరికీ అర్థమవుతుందని ఎమ్మెల్యే సీతక్క ఫైరయ్యారు.
కాగా, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్, పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరు పరచనున్నారు అధికారులు. ఏసీబీ కోర్టు నుంచే తర్వాతి ప్రక్రియ జరగనుంది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై నేటి సాయంత్రమే నిర్ణయం తీసుకోనున్నారు ఏసీబీ జడ్జి. దీంతో తెలుగు దేశం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.