కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారు – ఎమ్మెల్సీ కవిత

-

కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ప్రజలు అంతా ఓటు వేసేందుకు ముందుకు రావాలని కోరారు.

 

mlc kavitha

పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి.. కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన వాతావరణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. అటు తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.

మీ ఓటు..పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. మీ ఓటు..తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలన్నారు. మీ ఓటు..వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news