తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ !

-

తెలంగాణ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. మీ ఓటు..పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మీ ఓటు.. తెలంగాణ ఉజ్వల భవితకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

మీ ఓటు..తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగించాలన్నారు. మీ ఓటు..వ్యవసాయ విప్లవానికి వెన్నుముకగా నిలవాలన్నారు. మీ ఓటు..మహిళల ముఖంలో చెరగని చిరునవ్వులు నింపాలని.. మీ ఓటు..యువత ఆకాంక్షలను నెరవేర్చే అవకాశాల అక్షయపాత్ర కావాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ మరియు తెలంగాణ పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు… నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. ఈ తరుణంలో అక్కడే కాపలా ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి వచ్చేసారు. గేట్లు తీయాలని ఏపీ పోలీసులు కోరగా… ఎందుకు తీయాలని తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల పోలీసుల మధ్య గొడవ చోటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news