తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు ఇంత వివక్ష అని కేరళలోని ఓ సభలో ప్రశ్నించారు. ఈ రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రమాదకరమని.. దక్షిణాది ప్రజలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్సన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఒకే వ్యక్తి ఒకే పార్టీ అనేది మోడీ రహస్య విధానం అన్నారు.
మరోవైపు ఢిల్లీలో ఆప్ ఓటమి పై సీఎం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి లోని ప్రతి పార్టీ అన్నీ తమకే కావాలని కోరుకుంటున్నాయి. అదే పెద్ద సమస్య అన్నారు. హర్యానాలో ఆప్ వల్ల కాంగ్రెస్ ఓడిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ అదే పని చేయడం వల్ల ఆప్ పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో చివరికీ లబ్ధి పొందుతుంది మాత్రం బీజేపీనే అన్నారు. అందుకే అంతా కలిసి వచ్చి ప్లాన్ ప్రకారం.. ముందుకు వెల్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.