అదానీ వ్యవహారంపై ద ఎకనామిస్ట్ నివేదికపై పార్లమెంటులో ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు సీఎం కేసీఆర్. అదాని రూపంలో దేశానికి ఉపద్రవం వచ్చి పడిందన్నారు. దీనిపై స్పందించాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు చెప్పినా మోడీ నోరు విప్పడం లేదని తెలిపారు. అదానీ గ్రూప్ ఆస్తులు కరిగిపోయాయి అన్నారు. అదాని సంస్థల్లో చాలా బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి అన్నారు. దీనిపై మోడీ యొక్క మాట కూడా మాట్లాడలేదని, దీనిపై వివరణ ఇవ్వాలని అన్నారు.
మన రాష్ట్రంలోనూ అదాని కంపెనీ పెడతామన్నారు.. పెట్టలేదు బతికి పోయామని వెల్లడించారు. దేశంలో ఎన్నో పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆరోపించారు. దేశం ఇంత దౌర్భాగ్యంగా మారిపోతున్న కొందరు ప్రధాని మోదీని పొగిడేస్తున్నారని చెప్పారు. రత్న గర్భం లాంటి దేశంలో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలో పిల్లలకు గ్రీన్ కార్డు వస్తే ఇండియాలో వారి తల్లిదండ్రులు పండగ చేసుకునే పరిస్థితి నెలకొంది అన్నారు. 8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకని ప్రశ్నించారు.