మోదీ నన్నూ అరెస్టు చేయాలని కుట్ర పన్నారు : కేసీఆర్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా తనను ఓడించాలన్న ధ్యేయంతో బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించిందని భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తనను ఏదైనా ఓ కేసులో ఇరికించాలని ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నించారని అన్నారు. కానీ ఎక్కడా తాను అవినీతి చేయకపోవడం వల్లే వాళ్లకు దొరకలేదని పేర్కొన్నారు. ఒక దశలో మోదీ తనను అరెస్టు చేయడానికి కుట్ర పన్నారని కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

kcr

‘సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన కాంగ్రెస్ పార్టీకి శాపం అవుతుంది. ఆయన..దేవుళ్లపై ఒట్టు పెట్టుకోవడం ఇబ్బందికర పరిణామం. కాంగ్రెస్‌పై ప్రజల్లో ఇప్పటికే  హేహ్యభావం కనిపిస్తోంది. పొర్లు దండాలు పెట్టినా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ 12 కు మించి ఎంపీ సీట్లను గెలుచుకుంటుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ సందర్భోచిత నిర్ణయం తీసుకుంటుంది. ఇక దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కేంద్రంలో ఈసారి కచ్చితంగా హంగ్ వస్తుందని అనిపిస్తోంది.’ అని కేసీఆర్ జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version