గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ అరెస్ట్ అయ్యాడు. ప్రిజం పబ్ దగ్గర పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు దొంగ. కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికు, ఓ బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి. ఈ తరుణంలోనే… దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని సమాచారం అందుతోంది.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం అని పోలీసులు చెబుతున్నారు. బత్తుల ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని సమాచారం. తాజాగా గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కాల్పులు జరిపాడు బత్తుల ప్రభాకర్. విశ్వసనీయ సమాచారం మేరకు పబ్‌లో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేశారు.
అయితే.. ఈ తరుణంలోనే… పోలీసులను చూసిన వెంటనే కాల్పులు జరిపాడు ప్రభాకర్.. కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గాయాలు కాగా… అతన్ని ఆస్పత్రికి తరలించారు. 2022లోనే విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు బత్తుల ప్రభాకర్. తాజాగా కాల్పుల ఘటనతో మళ్లీ వెలుగులోకి ప్రభాకర్ వచ్చాడు.
పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన దృశ్యాలు
తెలంగాణ, ఏపీలో 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్
బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు https://t.co/EhHAakJsy6 pic.twitter.com/yEvPWurcPf
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2025