సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన ఎంపీ అర్వింద్..!

-

తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గా తొలగిస్తే పర్సనల్ గా  కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తా అని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కిషన్ రెడ్డి పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణ అభివృద్ధి ని కిషన్ రెడ్డి
ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ తో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. గొప్పలకు పోయి గ్యారంటీలు ప్రకటించి.. ఇప్పుడు తిప్పలు పడుతున్నారని విమర్శించారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కిషన్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version