హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌..!

-

వస్తున్న లక్షల జీతాలు కాదని, డ్రగ్స్‌ వ్యాపారం చేసి మరింతగా సంపాదించాలనే అలోనచలతో డ్రగ్స్‌ అమ్మకాలు చేపడుగతూ తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్‌ను సరపరా చేయడానికి పూణే నుంచి హైదరాబాద్‌కు వాహనంలో ఎండిఎంఎ కిస్టల్స్‌ డ్రగ్స్‌ను తీసుకవస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ ఎక్సైజ్‌ పోలీసులకు దొరికాడు. జమ్ముకాశ్మీర్‌కు చెందిన హర్జత్‌ సింగ్‌ అనేవ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు తొలుతగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో వస్తున్న జీతామంతా డ్రగ్స్‌కే ఖర్చువుతుండడంతో తానే డ్రగ్స్‌ వ్యాపారీగామారి తోటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, ఇతరులకు డ్రగ్స్‌ను సరపరా చేసే స్థాయికి ఎదిగాడు.

డ్రగ్స్‌ కోసం మహారాష్ట్ర పూణే ప్రాంతానికి టాటా కారులో వెళ్లి అక్కడి నుంచి 120 మీల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్స్‌ డ్రగ్స్‌ను తీసుకొని హౖదరాబాద్‌కు వస్తున్న క్రమంలో సంగారెడ్డి డీటీఎప్‌, ఎక్సైజ్‌ పోలీసులు కలిసి సంగారెడ్డి మల్కాపూర్‌ ప్లైఓవర్‌ తనిఖీలు నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తనిఖీలు నిర్వహించగా వాహనంలో 120 మిల్లీ గ్రాముల ఎండిఎంఎ క్రిస్టల్‌ డ్రగ్స్‌ లభించాయి. డ్రగ్స్‌, వాహనం విలువ రూ. 21.06 లక్షలు ఉంటుందని అసిస్టేంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ కె.శ్రీనివాసరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version