రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం సరైన అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. తాజాగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో రోడ్డు సేప్టీ, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల ద్వారా వచ్చే అనర్థాలు పేద, ధనిక అనే తేడా లేకుండా బాధిత కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను దారిలోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. యాక్సిడెంట్లలో చిన్న కుటుంబాలు ఇన్వాల్ అయితే.. ఆ కుటుంబాలు జీవితాంతం ఇబ్బందులు పడుతాయి. ట్రాన్స్ ఫోర్ట్ డిపార్టుమెంట్ పరంగా ఎందుకు యాక్సిడెంట్ అవుతున్నాయో వాటిని మంత్రి గారు పరిష్కరించాలని కోరారు. నేషనల్ హైవేలు అయిన తరువాత స్పీడ్ పెరిగి యాక్సిడెంట్ లు పెరుగుతున్నాయని తెలిపారు.