ఇందిరమ్మ ఇళ్లు రాలేదని పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి !

-

Telangana: గ్రామ సభలోనే ఆత్మహత్య యత్నం చేసుకున్న నాగేశ్వరావు మృతి చెందారు. గ్రామ సభలో పురుగుల మందు తాగిన నాగేశ్వరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బుట్టాయిగూడెం గ్రామంలో జరిగిన గ్రామసభ లో ఇళ్ల కోసం పెట్టుకున్న అర్జిలో తన పేరు రాలేదంటూ మనస్తాపానికి గురై.. గ్రామ సభలోనే ఆత్మహత్య యత్నం చేసుకున్న నాగేశ్వరావు మరణించాడు. ఇక కుమ్మరి నాగేశ్వరరావు మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి వర్యులు సీతక్క… చనిపోయిన నాగేశ్వరరావు కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రకటించారు.

ప్రైవేట్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న నాగేశ్వర్ రావు ను ఎందుకు ఎంజియం ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని… ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగిందని వివరించారు. ప్రైవేట్ హాస్పటల్ యాజమాన్యం తో వారి కుటుంబం తో ఎప్పటికప్పుడు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మాట్లాడటం జరుగుతుంది మెరుగైన వైద్యం కోసం అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నామన్నారు. మృతుడికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాప తెలుపుతూ మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version