బీసీసీఐ నిర్ణయంపై ఎంపీ సంతోశ్ కుమార్‌ హర్షం

-

ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్‌ మ్యాచుల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌ బాల్‌కు 500 చొప్పున చెట్లను నాటాలని నిర్ణయించింది. దీని ప్రకారం డాట్‌ బాల్‌ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది. కాగా, బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. పచ్చదనం పెంచడం కోసం కొత్త ఆలోచనలతో వచ్చిన బీసీసీఐకి.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ టీమ్‌ తరఫున ఎంపీ సంతోష్‌ కుమార్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీకి లేఖ రాశారు. అలాగే ట్విటర్‌ ద్వారా కూడా ధన్యవాదాలు తెలిపారు.

“బీసీసీఐకి, రోజర్ బిన్నీకి నా కృతజ్ఞతలు. ఒక్కో డాట్ బాల్​కు 500 మొక్కలు నాటాలన్నా మీ ఆలోచనకు నా సెల్యూట్. ఈ కార్యక్రమంలో మీరు లక్షా 47వేల మొక్కలు నాటబోతున్నందుకు ధన్యవాదాలు. గ్రీన్ ఇండియా ఛాలెెంజ్ టీమ్ నుంచి కూడా మీకు కృతజ్ఞతలు. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని మీరు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది.” అంటూ ఎంపీ సంతోష్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version