నడ్డా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు – మంత్రి వేముల

-

నాగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్ పై బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బిజెపి అగ్రనేతలు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ఇక్కడి అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. “నడ్డా.. ఇది కెసిఆర్ అడ్డా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు” అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా..? రెండు పడకల ఇళ్ల కోసం తాము 12 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. వీటికి కేంద్రం ఇచ్చింది కేవలం 1200 కోట్లు మాత్రమేనని అన్నారు.

సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కుక్క తోక వంకర అన్నట్టు పదేపదే అదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గుజరాత్ గులాంలైన ఇక్కడి బిజెపి నాయకులు రాసి ఇచ్చిన పాత స్క్రిప్ట్ ను ఎన్నిసార్లు చదువుతారని నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్రం.. కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు కండిషన్లు పెట్టి రైతుల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version