పొంగులేటి చేరికను స్వాగతిస్తున్నా – రేణుక చౌదరి

-

 

 

పార్లమెంట్‌, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగవచ్చు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి చేరికను స్వాగతిస్తున్న..ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది అధిష్టానం నిర్ణయం అన్నారు. BRS, BJP రెండూ ఒక్కటే.. కోవర్టులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారన్నారు. రాజకీయ వ్యవస్థలో కోవర్టులు ఒక భాగం.. కాంగ్రెస్‌లోనూ కోవర్టులు ఉన్నారని చెప్పారు రేణుకాచౌదరి.

ఈటల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసు మొత్తం కాంగ్రెస్ పార్టీ చుట్టే తిరుగుతూ ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. కాసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో భేటీ అయిన రేణుక చౌదరి.. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాను సమావేశం అయ్యానని… ఇది చాలా క్యాజువల్ మీటింగ్ అని ఆమె తెలిపారు. పొంగులేటి ఎలాంటి డిమాండ్లు చేయలేదని… ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రేణుక చౌదరి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని రేణుక చౌదరి తెలిపారు. ఈటెల రాజేందర్ చాలా మంచి వ్యక్తి అని… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ వ్యక్తేనని ఆమె తెలిపారు. బిజెపి పార్టీలో కూడా కోవర్ట్లుఉన్నారని… ఎంపీ పువ్వాడ అజయ్ దుర్మార్గుడని ఫైర్ అయ్యారు రేణుక చౌదరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version