నాగార్జున‌సాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద

-

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. వరద నీరు పోటెత్తుతుండంతో ఉగ్ర‌రూపం దాల్చుతోంది. గంట గంటకూ కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈనేప‌థ్యంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 20 క్రస్టు గేట్లు ఎత్తి (14 గేట్లు 10 ఫీట్లు, 6 గేట్లు 20 ఫీట్ల మేర ఎత్తి) దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,19,454 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులకు చేరింది.

మ‌రోప‌క్క విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీకి కూడా వ‌ర‌ద నీరు పోటెత్తింది. దీంతో ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్‌ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పరివాహాక ప్రాం‍తాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైనాయి.

Read more RELATED
Recommended to you

Latest news