లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య పొత్తుకు మాయవతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య సీట్ల పంపకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్‌కర్నూల్, అదిలాబాద్ స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్ స్థానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదిలాబాద్ నుండి సిడం గణపతి బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.