Telangana: మహిళల భద్రత కోసం T-SAFE

-

 

మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సచివాలయంలో ప్రారంభించారు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

Telangana CM Revanth launches T-SAFE app for women’s safety

మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్‌ రూపొందించినట్టు పోలీసులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version