Nagoba Jatara begins in Keslapur today: ఇవాళ్టి నుంచి నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే ఇవాళ రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్నారు మెస్రం వంశీయులు.
వచ్చే నెల 4 వరకు కేస్లాపూర్ నాగోబా జాతర జరగనుంది.

ఇక ఈ నాగోబా జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నాగోబా జాతర ప్రారంభం కానున్న తరుణం లోనే 600 మంది పోలీసులు,100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు.