గోషామహల్‌లో దారుణం చోటు చేసుకుంది. గోషామహల్‌లో మరోసారి భారీగా నాలా రోడ్డు కుంగిపోయింది. దారుసలామ్ రోడ్డు నుంచి చాక్నావాడికి వెళ్లే రూట్లో ప్లైవుడ్ దుకాణాల ముందు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నాలా కుంగిపోయిందని స్తానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు.
అతిపురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే.. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ చేస్తున్నారు. వెంటనే అక్కడ నాలా రోడ్డు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వాహనాదారులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
గోశామహల్లో భారీగా కుంగిన నాలా రోడ్డు…
దారుసలామ్ రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు కుంగిన నాలా.
అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో కుంగిన శివరేజ్ పెద్ద నాలా. అర్ధరాత్రి ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. pic.twitter.com/FTiEutO2J1— ChotaNews (@ChotaNewsTelugu) October 23, 2024